ది వారియర్ టీజర్ తో దుమ్ములేపుతున్న హీరో రామ్..!!

Divya
కేరాఫ్ అడ్రస్గా నిలిచిన డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నది ఈ చిత్రంలో కన్నడ భామ అక్షర గౌడ కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు జరుగుతోంది.
ఇక ఈ రోజున చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించి టీజర్ని విడుదల చేశారు. హీరో రామ్ పుట్టినరోజు రేపు కావడం చేత ఒక రోజు ముందే ఈ సినిమా టీజర్ను విడుదల చేసి అతనికి బహుమతి ఇచ్చారు. ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి కూడా ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించ బోతున్నారు. ఇలా ఉండగా శనివారం విడుదలైన ది వారియర్ టీజర్ లో హీరో రామ్ దుమ్ములేపే సారని చెప్పవచ్చు. తాజాగా తన మాస్ డైలాగులతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ముందుగా ఈ పోలీసులు టార్చర్ భరించలేక పోతున్నాను అంటూ మొదలై ఆ తరువాత ఎంతో వైలెంట్ గా కనిపిస్తోంది. హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇవ్వడం చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. హీరో రామ్ చెప్పే ప్రతి ఒక్క డైలాగు కూడా ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక మధ్యలో కృతి శెట్టి హీరో రామ్ ల మధ్య రొమాన్స్ ఉండే విధంగా కనిపిస్తోంది. ఇక రామ్ కు తల్లిగా నటి నదియా నటించింది. ఇక ఈ టీజర్లో మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఎంటర్టైన్మెంట్ చేయడాని కి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంటా రేమో చూడాలి హీరో రామ్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: