యాంకర్ అనసూయకు ఫ్లైయింగ్ కిస్.. రెచిపోయిన జబర్దస్త్ కమిడియన్?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఒక సాదా సీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్  కామెడీ షోస్ లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అయితే జబర్దస్త్ పాపులారిటీ సాధించి నిర్మాతలకు డబ్బులు తెచ్చి పెట్టడమే కాదు.. జబర్దస్త్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఊహించని రేంజ్ లో పేరు తెచ్చిపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయకు కూడా భలే క్రేజ్ వచ్చి పడింది అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు ఎవరికీ తెలియని అనసూయ జబర్దస్త్ ద్వారా అందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. ప్రతి తెలుగు ఇంట్లో ఒక మనిషి గా మారిపోయింది అనసూయ.

 ఇక జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఏళ్లుగా యాంకర్గా కొనసాగుతూనే ఉంది. అయితే కేవలం జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే సరిపెట్టుకోకుండా మరోవైపు అటు వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటూ ఎన్నో కీలకమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని మాత్రం మరవకుండా ఇంకా జబర్దస్త్ యాంకర్ గానే కొనసాగుతూ ఉంటుంది. అయితే ప్రతి వారం జబర్దస్త్ కమెడియన్స్ సరికొత్త స్కిట్ లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో భాగంలో ఒక కమెడియన్ అనసూయకు అందరిముందే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి రెచ్చిపోయాడు.

 ఈ క్రమంలోనే ఇది చూసిన అనసూయ ఏకంగా సిగ్గు పడటం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే స్కిట్ లో భాగంగా ఒక వ్యక్తికి ముగ్గురు బాడీగార్డులు ఉంటారూ. అతను ఏం చేయాలనుకుంటే అది ఆ ముందుగా ఆ ముగ్గురు బాడీగార్డులు చేస్తారు. ఈ క్రమంలోనే అనసూయకు ఫ్లయింగ్ కిస్ ఇస్తాను అంటే చెబుతాడు సదరు వ్యక్తి.  దీంతో మొగుడు ముగ్గురు బాడీగార్డులు  కూడా అతని కంటే ముందుగానే ఫ్లయింగ్ కిస్ ఇస్తారూ. వీళ్లు చేస్తున్న కామెడీ చూసి అనసూయ తెగ నవ్వుకుంటుంది అని చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: