మరోకరితో డేటింగ్ లో ఉన్న ' ఐ' బ్యూటీ..

Satvika
ఐ.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..రోబో సృష్టి కర్త డైరెక్టర్ శంకర్ రూపొందించిన మరో హిస్టారికల్ మూవీ..ఈ సినిమా కూడా రోబో కన్నా కూడా ఘన విజయాన్ని అందుకుంది. విలక్షన నటుడు విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిట్ అవ్వడంతో ఇద్దరు బిజీ అయిపోతారని అందరు అనుకున్నారు. కానీ హిరోయిన్ మాత్రం ప్రేమ, డేటింగ్, పెళ్ళి అని సినీ కెరియర్ ను పక్కన పెట్టేసింది.ఓ బిడ్డకు తల్లి అయ్యాక అమ్మడు పెళ్ళి పీటలెక్కిన సంగతి అందరికి తెలిసిందే. రెండు మూడు సినిమాల లో మెరిసిన ఈ అమ్మడు తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పెసింది.


అతనితో కొద్ది రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ ఇద్దరు వేరు పోయారు.అమీ జాక్సన్ జార్జ్ పనయిటోతో రిలేషన్ షిప్‌లో ఉండేది. వీరిద్దరికీ 2019 ప్రారంభంలో నిశ్చితార్థం జరిగింది.వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు. అమీ,జార్జ్ 2020లో వివాహం చేసుకుందాం అనుకున్నారు.అయితే అనూహ్యంగా వీరిద్దరూ 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. అమీ జాక్సన్ కొత్తగా ప్రేమలో పడింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో అమీ జాక్సన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అంతేకాదు వీరిద్దరు కలిసి బయట పార్టీలకు కూడా హజరవుతుండం తో ఆ అనుమానాలు నిజం అని జనాలు అభిప్రాయ పడుతున్నారు..అమీ జాక్సన్ లండన్‌లో తన సెలవులను గడుపుతోంది. తన కొడుకుతో కలిసి లండన్‌లో ఉంటోంది. ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించింది అమీజాక్సన్.కాగా వీరిద్దరు వర్కౌట్ దుస్తుల్లో కనిపించారు.ఎడ్ వెస్ట్‌విక్ ..అమీ జాక్సన్ చేతులు పట్టుకుని కనిపించారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వీరిద్దరి వ్యవహారం పెద్ద చర్చలకు దారి తీసింది.వీరిద్దరు నిజంగా డేటింగ్ లో ఉన్నారా లేదా అన్నది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి..మళ్ళీ ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: