రాజమౌళి కోసం ఆ విషయంలో త్యాగం చేసిన మహేష్..!!

murali krishna
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు  సిద్ధమైంది. మే 12వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
అయితే ఈ సినిమా విషయంలో ఒక సెంటిమెంట్ ను మహేష్ బాబు త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట.రాజమౌళి కోసం త్యాగం చేయడానికి కూడా మహేష్ సిద్ధమయ్యాడని ప్రచారం అయితే జరుగుతోంది. అసలు ఆ సెంటిమెంట్ ఏమిటో? ఆ సెంటిమెంట్ రాజమౌళి కోసం మహేష్ ఎందుకు త్యాగం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే ఈ కథనం చదవాలి మరి.
సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా కాలం పాటు ఎలాంటి సినిమా  కూడా అనౌన్స్ చేయలేదు. మరోసారి ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనుహ్య పరిస్థితుల్లో తాను పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా అని ఈ మహేష్ ప్రకటన అయితే జారీ చేశారు.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.. నదియా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సముద్రఖని కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో అది నిజమే అని సూచనలు కూడా చాలానే కనిపించాయి.. అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా థియేటర్ మహేష్ బాబుకు ఆయన అభిమానులకు ఇద్దరికి సెంటిమెంట్.
ఆ సుదర్శన్ థియేటర్ లో విడుదల చేసిన పోకిరి, ఒక్కడు, దూకుడు, మురారి, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక మహేష్ కు మరపురాని హిట్స్ గా మిగిలిపోయాయట.అందుకే ఒకానొక సందర్భంలో తనకు స్వయంగా ఏఎంబీ ధియేటర్ ఉన్నాసరే, సుదర్శన్ థియేటర్ అనేది తన మనసుకు దగ్గరగా ఉండే థియేటర్ అని మహేష్ చెప్పుకొచ్చారు అంటే అది ఆయనకి ఎంతగా సెంటిమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
ఈ సమయంలోనే సర్కారు వారి పాట సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సుదర్శన్ థియేటర్ లో మహేష్ బాబు సర్కారు వారి పాటను విడుదల చేయాలని మహేష్ బాబు కూడా భావించారు. అయితే ప్రస్తుతం అందులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా నడుస్తుందట.. ఇప్పుడు సినిమా తీయాలంటే కష్టమేనట.ఎందుకంటే 50 రోజులు కూడా పూర్తి కాకుండా ఒక ప్రముఖ ధియేటర్ లో సినిమా తీసేసారు అంటే మిగతా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అనే ఉద్దేశంతో రాజమౌళి మహేష్ ను ఈసారికి వదిలేయాలని కోరారని సమాచారం.
మహేష్ కూడా పెద్దమనసు చేసుకుని మొదటి రెండు రోజులు రెండు రెండు షోలు తమ సినిమా వేసుకునే లాగా ప్లాన్ చేశాడని తెలుస్తుంది.. అయితే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. ఎందుకంటే బాహుబలి కోసం శ్రీమంతుడు ఆర్ఆర్ఆర్ కోసం సర్కారు వారి పాట వాయిదా వేసినా రాజమౌళి మాత్రం మనకు ఎప్పుడూ సహాయం చేయడం లేదని వారు కోపం వ్యక్తం చేస్తూన్నారు. అన్నట్టు రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకున్న విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: