ఈ వీకెండ్ విజేత ఎవరు ?

Seetha Sailaja
శుక్రువారం వచ్చిందంటే చాలు ఆవారం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ విజేత ఎవరు అని చర్చలు జరగడం పరిపాటి. అందువల్లనే కాబోలు ప్రభాస్ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారం వారం మారిపోయే మీడియా రేటింగ్స్ గురించి టెన్షన్ పడితే ఎవరు సినిమాలలో నటించలేరు అంటూ కామెంట్స్ చేసాడు. పెద్ద సినిమాలు విడుదల లేనప్పుడు మాత్రమే చిన్న సినిమాలు విడుదల చేసుకోవలసిన పరిస్థితి.

దీనితో ఈవారం ‘సర్కారు వారి పాట’ విడుదల అయ్యేంత వరకు ఉన్న వారం రోజుల గ్యాప్ ని ఉపయోగించుకోవాలని ఏకంగా నాలుగు సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. ఈసారి విడుదల అవుతున్న ఈనాలుగు సినిమాల ప్రమోషన్ ను పోటాపోటీగా చేసారు. ముఖ్యంగా విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీ విడుదల కాకుండానే ఈమూవీ హీరో అత్యుత్సాహంతో అనేక వివాదాలలో ఇరుక్కోవడంతో ఈమూవీకి ఎటువంటి ఖర్చు లేకుండానే ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది.

సుమ రీ ఎంట్రీ ఇస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మూవీని ఆమె చాలగట్టిగా ప్రమోట్ చేయడమే కాకుండా ఈమూవీ ప్రమోషన్ కోసం ఆమె టాప్ హీరోలు అందర్నీ రంగంలోకి దించింది. ఇప్పుడు ఈపోటీలో రామ్ గోపాల్ వర్మ కూడ ఎంటర్ అయి తన ‘డేంజరస్’ మూవీని ప్రమోట్ చేయడమే కాకుండా హీరోయిన్స్ చేత వర్మ మిద్దులు పెట్టించుకుంటూ బోల్డ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.  

శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీని ఏకంగా రాజమౌళి ప్రమోట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం విడుదల అవుతున్న ఈ నాలుగు సినిమాలలో కొంత శ్రీవిష్ణు వెనకడుగులో ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ బూతుల సినిమాను పక్కకు పెడితే ఈవారం విడుదల కాబోతున్న మూడు సినిమాల దర్శక నిర్మాతలు ఎవరికీ వారు తమ సినిమా మాత్రమే హిట్ అని అంచనాలు వేసుకున్నారు. ఈవారం ఓటీటీ లలో విడుదల అవుతున్న సినిమాలు చాల ఎక్కువగా ఉన్నాయి. దీనితో సగటు ప్రేక్షకుడు టీవీ లను వదిలి ఈ నాలుగు సినిమాలలో కనీసం ఒక్క సినిమా చూడగలరా అన్నదే సమాధానం లేని ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: