ఓ మై గాడ్ : ఆలోచనలో పడ్డ ఎన్టీఆర్ .... కారణం అదేనా .... ??

GVK Writings
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఆ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కలిసి నటించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఆ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్ కొమురం భీం గా నటించగా రామ్ చరణ్అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు.
రిలీజ్ తరువాత అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించి అతి పెద్ద సక్సెస్ సాధించిన ఆర్ఆర్ఆర్ దాదాపుగా ఇప్పటివరకు రూ. 1100 ,కోట్ల పైచిలుకు కలెక్షన్ ని ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇక దీని తరువాత త్వరలో కొరటాల శివ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. ఆయన కెరీర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ కొన్ని నెలల క్రితమే వచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేస్తున్నారని, ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకునేలా ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ఇటీవల ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల మాట్లాడుతూ చెప్పారు. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ మూవీ ఆచార్య తో తన కెరీర్ లోనే ఫస్ట్ టైం భారీ ప్లాప్ చవిచూశారు కొరటాల.
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరన కలిసి నటించిన ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆచార్య ప్లాప్ అవడంతో కొంత ఆలోచన చేసిన ఎన్టీఆర్, తనతో చేయబోయే మూవీ స్క్రిప్ట్ విషయమై ఎన్టీఆర్ మరింత జాగ్రత్త కనబరుస్తున్నారని, అందుకే ఇటీవల ప్రత్యేకంగా కొరటాలని ఇంటికి పిలిపించిన ఎన్టీఆర్ స్క్రిప్ట్ మరొక్కసారి విని అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయించారు అని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్, తప్పకుండా కొరటాల శివ తీస్తున్న మూవీతో మరొక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: