అబ్బా : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వస్తుందబ్బా ..... ??

GVK Writings
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధేశ్యామ్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చారు. పూలజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ రేంజ్ లో అత్యధిక ఖర్చుతో రూపొందిన రాధేశ్యామ్ మూవీ భారీ పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఎమోషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన రాధేశ్యామ్ పరాజయంతో ఒకింత ఆలోచనలో పడ్డ హీరో ప్రభాస్, ప్రస్తుతం చేస్తున్న ప్రాజక్ట్స్ యొక్క అవుట్ ఫుట్ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కే, ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. వీటిలో ఆదిపురుష్ మూవీ మైథలాజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగ అశ్విన్ తీస్తున్న ప్రాజక్ట్ కె మూవీ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ గా వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీపైన మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ద్వారా సంచలన విజయం నమోదు చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని కూడా ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్.
అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్ నుండి మే నెల చివరి వారంలో ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ప్రభాస్ పాత్ర ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉండనుందని, హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్, నెగటివ్ పాత్రలు చేస్తున్న జగపతి బాబు, పృథ్విరాజ్ వంటి వారి పాత్రలు కూడా అదిరిపోతాయట. ఇక ఈ నెల నాలుగవ వారంలో రానున్న సలార్ ఫస్ట్ లుక్ టీజర్ తరువాత మూవీపై అందరిలో మరింతగా అంచనాలు పెరగడం ఖాయం అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: