విజయవాడలో మెగా అభిమానులు హల్ చల్..

Satvika
మెగా ఫ్యాన్స్ కు ఈరోజు పండగే.. ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ఆచార్య సినిమా ఈరోజు థియెటర్లలోకి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు సమానంగా స్క్రీన్ ను షేర్ చేసుకున్న సినిమా కావడంతో సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ప్రమోషన్స్ లో చెప్పిన విధంగా సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో తెలుగు రాష్ట్రాల లోని మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎపిలో సినిమాకు మంచి స్పందన లభించింది.తండ్రి కొడుకులను ఒకే స్క్రీన్ పై చూడాలని అనుకున్న వారి కోరిక నేరవెర్చారు దర్షకుడు.


ఈ సినిమాలో కొన్ని మంచి టాక్ ను అందుకోగా, మరి కొన్ని మాత్రం తెలిపొయాయని టాక్ ను అందుకున్నాయి.కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు ఉండటం సినిమాకు మైనస్ అని సినీ అభిమానులు చెబుతున్నారు..రామ్ చరణ్ యాక్టింగ్ సినిమాకు హైలెట్ కాగా, మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.లాహె లాహె సాంగ్ లోచిరంజీవి డ్యాన్స్ హైలెట్ అయ్యాయి. సాంగ్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ ను తీసుకువ‌చ్చాయి. తండ్రీకొడుకులు పోటీ పడి మరి ఫైట్ చేసారని సినిమాను చూస్తే తెలుస్తుంది.. ఓ మాటలో చెప్పాలంటే సినిమా యావరెజ్ అనే టాక్ ను అందుకుంది.


కాగా, ఏపీలో కొన్ని ప్రాంతాల్లొ మాత్రం థియెటర్ల వద్ద మెగా అభిమానులు వీరంగం సృష్టిస్తున్నారు. చరణ్ బాబు బాగా చెసారని హంగామా చేశారు.విజయవాడ లో చిరంజీవి అభిమానులు హల్ ఛల్. థియేటర్ల వద్ద ఆచార్య సినిమా విడుదల సందర్భంగా పూల వర్షం కురిపించిన అభిమానులు.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలతో థియేటర్ వద్ద హల్ చల్ చేస్తున్న అభిమానులు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ థియేటర్ వద్ద హల్ చల్ చేశారు..ఇప్పుడు అది వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: