హీరోయిన్ నందిత శ్వేతను ఏడిపించిన.. ఆ బహుమతి ఏంటో తెలుసా?

praveen
నందితా శ్వేత.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మోస్తరు పాపులారిటీ ఉన్న హీరోయిన్. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా అనే సినిమాలో నటించింది. అందం అభినయంతో ఎంతోమంది ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎందుకో ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం తగ్గిపోయాయ్. ప్రస్తుతం అడపాదడపా  పాత్రలు మాత్రమే చేస్తూ ఉంది. ఇక అలాంటి నందిత శ్వేత ఇటీవలే ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ లో జడ్జిగా అవతారమెత్తింది అన్న విషయం తెలిసిందే. తనదైన జడ్జిమెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.

 ఇకపోతే ఏప్రిల్ 30వ తేదీన నందిత శ్వేతా బర్త్ డే ఉండడంతో అటు ఢీ షో నిర్వాహకులు నందిత శ్వేతాకు సర్ప్రైస్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఇక ముందుగా అడ్వాన్సుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా ఇక నందిత శ్వేత కు తన బంధువైన టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇక అంతకు ముందు విడుదలైన ప్రోమోలో నందిత శ్వేత కోసం ప్రదీప్ ఒక బాక్స్ లో బహుమతి తీసుకొచ్చి పెడతాడు.. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత నందిత శ్వేత ఒక్కసారిగా భోరున ఏడవడం చూపించారు. అదేంటి నందితా శ్వేత అలా బాక్స్ ఓపెన్ చేయగానే అంతలా ఏడవడానికి అందులో ఏముంది అని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

 ఈ క్రమంలోనే  ఇటీవలే ఎపిసోడ్ చూస్తే గాని చివరికి ఆ బాక్స్ లో ఏముంది నందిత శ్వేత ఏడవడానికి కారణం ఏంటి అన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ప్రోమో లో చూపించిన విధంగా యాంకర్ ప్రదీప్  బాక్స్ తీసుకువచ్చి నందిత శ్వేతా కి ఇస్తాడు. ఇక ఆ బాక్స్ ఓపెన్ చేయగానే హీరోయిన్ నందిత శ్వేత ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. దీంతో అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ బాక్స్ లో ఉన్న ఒక చిన్న కుక్క పిల్లని బయటకు తీస్తాడు యాంకర్ ప్రదీప్. ఇది చూసిన తర్వాత ఒక కుక్క పిల్ల కోసం ఇంతలా ఏడ్చిందా అని అందరూ అనుకుంటారు. కానీ అసలు విషయం చెబుతాడు ప్రదీప్. నందిత శ్వేత తనకు ఎంతో ఇష్టమైన ఖుషి అనే కుక్కపిల్లను కోల్పోయింది.  ఇక అచ్చం ఈ కుక్కపిల్ల లాగే ఉంటుంది. అందుకే ఆమె అంత ఎమోషనల్ అయింది అని చెబుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: