అనుపమకి కోపం తెప్పించిన కుర్రాళ్లు..ఏం చేశారంటే?

Satvika
అనుపమ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రెక్షకుల ను పలకరించిన ఈ అమ్మడు ఆ సినిమా తో మంచి టాక్ ను అందుకుంది.ఆమె నటన, అందం తో అందరినీ తెగ ఆకట్టుకుంటూ వస్తుంది. దాంతో ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎక్కువగా అందాల ఆరబోత కు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం డిమాండ్ ఉన్న క్యారెక్టర్స్ ను చేస్తూ వచ్చింది.


గత కొన్ని రోజుల క్రితం వరకూ సినిమాల కు కాస్త దూరంగా వుంది.. డైరెక్షన్‌లో అడుగు పెట్టింది. అలా కొద్ది రోజులు తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాల లోకి యూటర్న్ తీసుకుంది. ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమా తో పలకరించింది. ప్రస్తుతం అనుపమ చేతి లో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తుంది..చాలా షాప్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్ళింది అనుపమ. సెలబ్రిటీలు వచ్చినప్పుడు అక్కడి జనాలు చుట్ట ముట్టడం, సెల్ఫీల కోసం ఎగబడటం మామూలే..


కాగా, మొన్నీమధ్య ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు అనుపమ వెళ్లారు. తెలంగాణ కొదాడ వెళ్ళింది. అక్కడ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్ తర్వాత అనుపమ మీడియా తో మాట్లాడింది. అనుపమ తో సెల్ఫీలు తీసుకోవడాని కి అభిమానులు ,స్థానికులు ఎగబడ్డారు. అనుపమ వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగా కొంత మంది ఇంకాసేపు ఉండాలని అరుస్తూ డిమాండ్ చేశారు. అయితే ఆమె వెళ్ళే కారులో గాలి తీసారు.. దాంతో అమ్మడుకు కోపం వచ్చింది. ఇంకేమీ మాట్లాడ కుండా అక్కడ నుంచి వచ్చేసింది.. ఇకపోతే అమ్మడు సామాజిక మాధ్యమాల్లొ కుడా చురుగ్గా ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: