సీనియర్ హీరో ప్రేమలో బిజినెస్ మ్యాన్ కూతురు... కట్ చేస్తే ?
అయితే ఇటీవలే వైజాగ్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త కూతురుతో ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ హీరో ఇప్పటికే 12కు పైగా సినిమాలలో నటించారు. దీనితో సినీ పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు హీరోయిన్లతో కూడా ఆ హీరోకి లవ్ ఎఫైర్లు ఉన్నట్లు కూడా అప్పట్లో చాలా కథనాలే వినిపించాయి. కాగా తాజాగా ఈ బిజినెస్ మెన్ డాటర్ తో లవ్ గురించి ఆమె ఇంట్లో తెలిసిపోవటంతో మొదట పెళ్ళికి ఒప్పుకోక పోయినప్పటికీ ఆ తర్వాత రెండు కుటుంబాలు మాట్లాడుకొని వారి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అయితే వారి పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో ఈ హీరో మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలియడంతో వారి మద్య తరచూ గొడవలు వస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆ హీరో తనని కనుక పెళ్లి చేసుకోకుండా తనకి అన్యాయం చేస్తే.. మాత్రం అతనిని కచ్చితంగా మీడియా ముందుకు లాగి రచ్చ రచ్చ చేస్తానని బెదిరిస్తోందట. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త సినిమా ఇండస్ట్రీలో మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనితో ఆ హీరోకి మరీ సన్నిహితంగా ఉన్న ఓ ప్రముఖ సినీ నిర్మాత ఈ విషయంలో కలగజేసుకుని ఇరువురికి సర్ది చెప్పారట.. ఇక నుండి అయినా ఆ హీరో వేరే అమ్మాయిల జోలికి పోకుండా కామ్ గా ఉంటాడో లేదో చూడాలి.