త్రివిక్రమ్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా..?

N.ANJI
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మాటల మాంత్రికుడిగా, ప్రముఖ రచయితగా, దర్శకుడిగా తనదైన శైలిలో గుర్తింపు దక్కించుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు దర్శకుడిగా త్రివిక్రమ్ వ్యవహరించారు. ఈ సినిమా బిగ్గేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా అందుకుంది. ఈ సినిమా ద్వారా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చిత్రీకరించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఇప్పటివరకు దర్శకత్వం వహించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాగే హీరోలకు కూడా మంచి లైఫ్ అందించారు.
ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ఎలా ఉంటారో అందరికీ తెలుసు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు. అయితే త్రివిక్రమ్ పెళ్లి ఒక సినిమా స్టోరీగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. త్రివిక్రమ్ పెళ్లి విషయంపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. కొంత కాలం పాటు త్రివిక్రమ్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కమెడియన్ సునీల్‌తో పరిచయం ఏర్పడి.. మంచి స్నేహితులు అయ్యారు. అలా 1998 సంవత్సరంలో వచ్చిన ‘స్వయంకృషి’ సినిమాకు మాటలు రాశారు.
మొదట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలాగ్ రైటర్‌గా పని చేశారు. సినిమాల్లో డైలాగులు, పంచులు రాసి మాటల మాంత్రికుడిగా బిరుదు పొందారు. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలు. త్రివిక్రమ్ సౌజన్య వాళ్ల అక్కను పెళ్లి చూపులకు చూడటానికి వెళ్లాడు. కానీ అక్కడ తనకు సౌజన్య బాగా నచ్చడంతో ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడంట. దీంతో కుటుంబీకులు పెద్దమ్మాయి పెళ్లి అయిన తర్వాత సౌజన్యతో వివాహం చేసుకోమని తెలిపారంట. దీంతో వీరికి 2002లో వివాహం జరిగింది. కాగా, సౌజన్య మంచి కూచిపూడి డ్యాన్సర్. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో ఆమె ప్రదర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: