సౌత్ టాప్ 5 డైరెక్టర్స్.. అదిరిపోయే రేంజ్..!!

P.Nishanth Kumar
సౌత్ సినిమా పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయి లో డైరెక్టర్లు తమ సత్తా చాటడం జరుగుతుంది. ఇంతకు ముందు దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో సినిమాలు చేసే దర్శకుల పేర్లు ఒకటి రెండు మాత్రమే వినిపించేవి. రోబో సినిమాతో శంకర్, గజిని సినిమా తో మురుగదాస్.. వీరి గురించే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. కానీ ఆ తర్వాత బాహుబలి సినిమా ద్వారా రాజమౌళి ముందుకు దూసుకు వచ్చారు. ఆ సినిమా యొక్క రెండు భాగాలు కూడా సంచలన విజయాలు అందుకోవడంతో దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఆయన ఇప్పుడు వెలిగిపోతున్నారు.

ఇతర డైరెక్టర్లు సైతం రాజమౌళి పనితనానికి సాహో అనేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా అంటే ఇలా చేయాలి అనేలా ఆయన తమ సినిమాలను రూపొందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా భారీ స్థాయి లో విజయాన్ని అందుకుంది. అలా ఈ ముగ్గురు మాత్రమే కాకుండా మరికొంత మంది కూడా తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోతున్నారు. సంవత్సరాలు పెరిగే కొద్దీ దర్శకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అలా రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ సినిమా బాహుబలి ని మించిన విజయాన్ని అందుకోవడమే ఆయన ఈ స్థాయిలో చర్చకు రావడానికి కారణం.

ఇంకా కొంత మంది దర్శకులు కూడా పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. సుకుమార్ ఈ మార్కెట్ లోకి రాకెట్ స్పీడ్ తో దూసుకువచ్చాడు. అతి తక్కువ సమయంలోనే పుష్ప తో అంతటి స్థాయిలో విజయాన్ని అందుకోవడం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక భవిష్యత్తులో కూడా ఓం రౌత్, నాగ్ అశ్విన్, పూరీ జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు ఈ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టి తమ సత్తా చాటుతున్నారు. సౌత్ సినిమాలకు సినీ జనం బ్రహ్మరథం పడుతున్న క్రమంలో అనూహ్యంగా ఈ సినిమాలను హీరోలు మాత్రమే కాకుండా దర్శకులు కూడా చేస్తూ ఉండడం విశేషం. తగిన బడ్జెట్ ను కేటాయిస్తే బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ ను ఢీకొట్టే సినిమాలను కూడా తీయగల సత్తా తమకుందని వీరు నిరూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: