శేఖర్ సినిమా తో జీవిత సత్తా చాటుతుందా..!!

Divya
టాలీవుడ్ లో మహిళా దర్శకురాలిగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారిలో సావిత్రి ,విజయనిర్మల తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎక్కువ కాలం దర్శకురాలిగా కొనసాగుతోంది మాత్రం జీవిత రాజశేఖర్ అని చెప్పవచ్చు.. రాజశేఖర్ సహాయంతోనే జీవిత తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నందినీరెడ్డి ,సౌజన్య వంటి కొంతమంది దర్శకులు ఉండగా.. ప్రస్తుతం తెలుగు మహిళా దర్శకులు నిరూపించాల్సి ఉంటుంది. ఇకపోతే జీవిత రాజశేఖర్.. తరువాత మరొకసారి తన దర్శకత్వంలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూ ఉండటం చాలా ఆసక్తికరంగా మారుతోంది.
రాజశేఖర్ నటిస్తున్న తన 91 వ చిత్రం శేఖర్ సినిమాని తెరకెక్కిస్తోంది జీవిత. హీరో గా రాజశేఖర్ నటిస్తున్నారు. కథ ప్రకారం ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాని కూడా నటిస్తున్నది. చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, వెంకట శ్రీనివాస్, శివాత్మిక రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 20వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. నాకెంతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసింది జీవితం. ఈ సినిమా ప్రతి ఒక్కరు హృదయాలలో కూడా గుర్తుండి పోయేలా ఉంటుందని తెలియజేశారు.

ప్రతి ఒక్కరి కుటుంబంలో జరిగిన కొన్ని ఎమోషన్స్, కుటుంబంలో జరిగే కొన్ని సన్నివేశాల గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని తెలిపారు. గోరింటాకు, అన్నయ్య, సింహారాశి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ ఆ తరువాత శేఖర్ సినిమాతో ప్రతి ఒక్కరిని అలరిస్తారని.. స్థాయిని పెంచేలా ఉంటుంది అని తెలియజేసింది. ప్రస్తుతం రాజశేఖర్ సరికొత్త లుక్ పని మీద ఉండటం వల్ల బయటికి రాలేకపోతున్నాడు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. రాజశేఖర్ భిన్నమైన గెటప్ లతో కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమా పై నటుడు సమీర్ మాట్లాడుతూ ఈ సినిమాలో తనకు ప్రాధాన్యత నిర్వహించిన రాజశేఖర్ గారు సెట్లో అందరితో చాలా జాలీగా ఉంటారు. ఈ సినిమా కూడా విజయం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: