రచ్చ రవిని గలీస్ గా తిట్టిన సుమా.. ఇలా అనేసిందేంటి?

praveen
ఇటీవల కాలంలో బుల్లితెరపై వివిధ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు. ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమం కూడా ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి వారం కూడా నలుగురు సినీ సెలబ్రిటీలను ఈ షోలో  పిలవడం  వారితో ఫన్నీ టాస్క్ లు ఆడించి ఎంటర్టైన్మెంట్ పంచడం చేస్తూ వుంటుంది సుమా.

 క్యాష్ కార్యక్రమంలో భాగంగా సుమా స్పాంటేనియస్ పంచులు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయ్ అని చెప్పాలి . అప్పుడప్పుడు క్యాష్ షో లో భాగంగా కారులో భూములతో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే క్యాష్ షో లో కొన్ని గొడవలు జరిగాయని ప్రోమోలో చూపించడం చేస్తూ ఉన్నారు అనే చెప్పాలి. ఇటీవలే క్యాష్ షో లో భాగంగా రచ్చ రవి, భద్రం, తాగుబోతు రమేష్, ఖుయ్యుమ్  లను గెస్ట్గా పిలిచింది. ఎప్పటిలాగానే క్యాష్ షో మొత్తం ఎంతో సందడి సందడి గానే సాగిపోయింది అని చెప్పాలి.

 ఇక ప్రోమో చివరిలో సుమ రచ్చ రవి మధ్య ఒక వివాదం చోటుచేసుకుంది. ఎన్నిసార్లు క్యాష్ షో కి పిలిచావ్ ఒక్కసారైనా నన్ను గెలిపించవా అంటూ అడుగుతాడు రవి. అంటే ఇప్పుడు నేను నిన్ను రెకమెండ్ చేయాలా అంటూ చెబుతుంది సుమ.. ఎంమందికి ఇప్పటివరకు ఆన్సర్లు చెప్పలేదు నువ్వు అంటూ చెబుతాడు రచ్చ రవి.  ఆన్సర్ చెప్పడం ఏంటి పిచ్చి పిచ్చి గా మాట్లాడకు అంటుంది సుమ. రచ్చ రవి ఏదో లోలోపల అనుకుంటూ బూతులు మాట్లాడుతాడు. ఇంకోసారి ఇలా మాట్లాడితే అస్సలు బాగుండదు ఎందుకు పిలుస్తారు ఇలాంటి స్టుపిడ్స్, ఇడియట్స్ ను
 అంటూ తన చేతిలో ఉన్న కార్డు నేలకేసి కొడుతుంది. తర్వాత ఒక బూతు తిట్టబోతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: