ఈ సినిమా సక్సెస్ కోసం హీరో రవితేజ భారీ కసరత్తు..!

N.ANJI

కరోనా లాక్‌డౌన్ తర్వాత ‘క్రాక్’ సినిమాతో ఫుల్ ఫామ్‌లో వచ్చారు మాస్ మహారాజ రవితేజ. కరోనా టైం పీరియడ్‌లో థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూస్తారనే నమ్మకం లేదు. అలాంటి కఠినమైన టైంలో కూడా సినిమాను థియేటర్లలో విడుదల చేసి మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఖిలాడీ సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేదు. ఆ తర్వాత రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాను డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.


తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెతోపాటు బాలీవుడ్ నటి దివా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు జీవీ. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక సెట్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరిస్తున్నారని టాక్. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. క్రాక్ సినిమా మంచి సక్సెస్ అందుకున్న రవితేజ.. ఈ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు.


కాగా, భారీ ఆశలతో విడుదలైన ‘ఖిలాడీ’ సినిమా మాత్రం ప్లాప్ అయింది. అయినా రవితేజకు ఆఫర్లు తగ్గలేవు. సినిమా రిజల్ట్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే అదే జోష్ కొనసాగాలంటే మాత్రం సక్సెస్ కావాల్సిందే. దీంతో రవితేజ ‘టైగర్ నాగశ్వరరావు’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమాతో హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దర్శకుడు వంశీ కూడా అదే కసితో సినిమాను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా ఎలా ఉంటుందో తెలియదు. మరి సినిమా విడుదలైన తర్వాత రవితేజ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా? రాడా? అనేది మరికొద్ది రోజులు ఎదురు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: