బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ వీడియో వైరల్..!!

Divya
అక్షయ్ కుమార్ హీరోగా రవీనా టాండన్ కథానాయకిగా నటించిన చిత్రం మొహ్రా. ఈ సినిమాలో అన్ని పాటలు ఎంతో రొమాన్స్ తో అప్పట్లో కుర్రకారులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అంతే కాకుండా ఇందులో" టిప్పు టిప్పు బర్సా పాని" అనే పాట 1990లో ఈ పాట హైలెట్ గా నిలిచింది. ఇక ఇందులో రవీనా టాండన్ అందచందాలు ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు ఇదే పాటకు హీరో ప్రభాస్ తనదైన శైలిలో స్టెప్పులు వేశారు. రవీనా టాండన్ తో కలసి ప్రభాస్ వేసిన స్టెప్పులు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది.

ప్రభాస్ విత్ ప్రైమ్ మినిస్టర్ రవీనా టాండన్  అంటూ అభిమానులు ఈ వీడియోని చాలా వైరల్ గా చేశారు. ఓ క్యూట్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కూడా చాలా ఆనంద పడుతున్నారు. అయితే ఈ సందడంతా బాలీవుడ్ బుల్లితెర పై జరిగిన రియాల్టీ షోలో చేయడం జరిగింది. రవీనా టాండన్ కూడా ఇటీవల కే జి ఎఫ్-2 లో ప్రధాని గా నటించింది. ఇక ఆ పాత్రకు మంచి స్పందన లభించింది. ఇక అంతే కాకుండా ప్రభాస్ సరసన నటించిన శ్రద్ధా కపూర్ కూడా ఈ రియాల్టీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఇక ఈ వీడియో విషయానికి వస్తే రవీనా చెయ్యి పట్టుకుని.. ప్రభాస్ స్టెప్పులు వస్తుంటే రొమాంటిక్గా ఫోజులిస్తే శ్రద్ధ చాలా ఆశ్చర్యానికి గురి అవుతోంది. ఇలాంటి అరుదైన మ్యూజికల్ ఫీలింగ్ ప్రభాస్ లో కూడా ఉంది అన్నట్లుగా చూస్తోంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రభాస్కి ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ లభించింది. ఇన్ని రోజులు సౌత్ కే పరిమితం అనుకున్న ప్రభాస్ ఎప్పుడు హద్దుల్ని చెరిపేసి ఆక్కడ కూడా రోల్ మోడల్ గా  మారుతున్నాడు ప్రభాస్. మరి ప్రభాస్ టాలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: