రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన విజయ్ సినిమాలు..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , విజయ్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ తాను నటించిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఇమేజ్ ను క్రియోట్ చేసుకున్నాడు.  ఇది ఇలా ఉంటే విజయ్ తన డబ్బింగ్ సినిమా ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను సాధించిన ఐదు సినిమాల గురించి తెలుసుకుందాం.


బీస్ట్ : విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్  దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమా విడుదలైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.81 కోట్ల కలెక్షన్ లను సాధించింది,  ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని సమకూర్చాడు.

 
మాస్టర్ : విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమా విడుదలైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.01 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


విజిల్ : విజయ్ హీరో గా నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన విజిల్ సినిమా విడుద లైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.58 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


సర్కార్ : విజయ్ హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన సర్కార్ సినిమా విడుదలైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2. 32 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


అదిరింది : విజయ్ హీరో గా అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన అదిరింది మూవీ విడుదలైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.33 కోట్ల వసూళ్ల ను సాధించింది, ఈ సినిమా కు ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: