ఆ తేదీ నుండి 'ఓటిటి' లో స్ట్రీమింగ్ కాబోతున్న గని..!

Pulgam Srinivas
కొంతకాలం క్రితం వరకు 'ఓ టి టి'  ల క్రేజ్ అంతగా లేదు,  కానీ ఎప్పుడైతే కారోనా  దేశం లోకి ఎంటర్ అయిందో అప్పటి నుండి 'ఓ టి టి' ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది,  కరోనా కారణం వల్ల థియేటర్ లపై ఆంక్షలను విధించడం,  ఆ తర్వాత కారోనా  కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోవడంతో కొంత కాలం పాటు థియేటర్ లను  పూర్తిగా మూసివేయడంతో సినీ ప్రేక్షకులకు 'ఓ టి టి'  లే ప్రధాన దిక్కుగా మారాయి,  దానితో ప్రేక్షకులు కూడా 'ఓ టి టి'  లకు బాగా అలవాటు పడిపోయారు,  దానితో   'ఓ టి టి' సంస్థలు కూడా ప్రేక్షకుల ముందుకు మంచి మంచి కంటెంట్ ను  తీసుకు రావడంతో ప్రేక్షకులు మరింతగా 'ఓ టి టి'  లకు అలవాటుపడిపోయారు,  ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలు నేరుగా 'ఓ టి టి'  లో విడుదల అవుతూ ఉంటే మరి కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదలైనప్పటికీ అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.  

ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ నటించిన గని సినిమా  మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి'  లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది,  వరుణ్ తేజ్  హీరోగా తెరకెక్కిన గని మూవీ లో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటి8నచ్చింది, ఈ మూవీ కి  కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు.  దర్శకుడు కిరణ్ కొర్రపాటి మూవీ ని  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు, ఈ  సినిమా  ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 8 వ తేదీన థియేటర్ లలో విడుదలైంది, ఈ మూవీ  బాక్సాఫీసు దగ్గర  పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ  సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది,  వరుణ్ తేజ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన గని సినిమా తెలుగు ప్రముఖ 'ఓ టి టి'  ఆహా లో ఏప్రిల్ 29 వ తేదీ నుండి స్ట్రీమింగ్  కాబోతునట్లు సమాచారం,  దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: