మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రీలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలతో బిజీ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. చిరంజీవి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. అందులో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్.ఇక నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

ఇకపోతే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక కీలక అతిధి పాత్రలో నటిస్తున్నారు.ఇదిలావుండగా తాజా సమాచారం ప్రకారం, పక్కా కమర్షియల్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11 లేదా 12 తారీఖుల్లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం సౌండ్ వినిపిస్తోంది. అయితే ఇండిపెండెన్స్ డే హాలిడేస్ ను క్యాష్ చేసుకునే అవకాశం తోపాటూ ఎటువంటి పెద్ద సినిమాలు కూడా విడుదల కాకపోవటంతో అప్పుడే ఈ సినిమాను విడుదల చేస్తారని రీసెంట్ సమాచారం. అయితే అదేనిజమైతే మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఇకపోతే  ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా చిరు ప్లాన్ చేసుకున్న తీరు మిగిలిన హీరోలకు సవాల్ విసురుతుంది.కాగా చిరంజీవి నటించిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదలవటానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా.. అయన మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళా శంకర్ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే ఒక పెద్ద స్టార్ నుండి వరస సినిమాలు రావటం చాలా గొప్ప విషయం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: