మహేష్ సినిమాకు హాలీవుడ్ కష్టం..ప్రతిసారి!!

P.Nishanth Kumar
మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల సమయంలో ఓ అనుకోని కష్టం ఎదురవడం ప్రేక్షకులకు ముఖ్యంగా మహేష్ అభిమానులను ఇది ఎంతగానో నిరాశపరుస్తుంది. ఈ సినిమాకి మాత్రమే కాదు మహేష్ బాబు ఏ సినిమాకైనా కూడా ఈ సరికొత్త కష్టం ఎదురవడం వారిని మరింత నిరాశపరుస్తుంది.

అదేమిటో కాదు మహేష్ సినిమా విడుదలైనప్పుడే ఓ హాలీవుడ్ విడుదల కావడం జరుగుతుంది. అలా సర్కారు వారి పాట చిత్రం విడుదల సమయంలో హాలీవుడ్ లో భారీ సినిమాలను తెరకెక్కించే నిర్మాణ సంస్థ మార్వెల్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్ సినిమా విడుదల కాబోతుంది. గతంలో మహేష్ సినిమాలు విడుదల సమయంలో ఈ సంస్థ నుంచి వచ్చిన సూపర్ హీరోల సినిమాలు వచ్చి మహేష్ కలెక్షన్ల పై భారీగా ప్రభావాన్ని చూపాయి. ఆ విధంగా ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ల పై కూడా మార్వెల్ సినిమా ఏమైనా ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. 

తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని ఎలాంటి సందేహం లేదు. మాస్ మసాలా అంశాలను బాగా చిత్రీకరించి ఈ సినిమాను మహేష్ అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వం గురించి వంక పెట్టనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు విడుదల కాగా అవి భారీ విజయాలను సాధించాయి. మరి ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి రికార్డులను నెలకొల్పుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మార్వెల్ సినిమా ప్రభావం ఏస్థాయిలో ఉంటుందో. మహేష్ కలెక్షన్ల పై ప్రభావం చూపిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: