మరో అరుదైన రికార్డ్ అందుకున్న 'ఆర్ ఆర్ ఆర్'..!

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా సినిమా ఆర్ఆర్ ఆర్. అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి నీ తెరకెక్కించిన సినిమా ఇది . అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే .ఇక రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' మూవీ మ్యానియా ఇంకా తగ్గలేదు. అయితే ఈ సినిమా విడుదలై ఇస్పటికి 11 రోజులైంది. ఇకపోతే అయినప్పటికీ ఈ సినిమా నిలకడైన కలెక్షన్స్ సాధిస్తూ ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది ఈ సినిమా.

ఇక ఈ సినిమా అటు ఓవర్సీస్ లోనూ, ఇటు ఇండియా వైడ్‌గానూ తన సత్తా చాటుకుంటోంది.

అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి రూ. 750 కోట్లు పైగానే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా, బాలీవుడ్ లో రూ. 200కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక అసలు విషయం ఏమిటంటే అన్ని చోట్ల రికార్డు కలెక్షన్స్ రాబట్టిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం మరో విషయంలో కూడా తన పేరిట అరుదైన రికార్డు ను నెలకొల్పింది. ఇక అదేంటంటే ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేడా బేస్ సంస్థ (ఐయండీబీ) లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సినిమాల లిస్ట్ లో టాప్ 5 లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్' నిలిచింది.అయితే అంతేకాదు ఇతర హాలీవుడ్ సినిమాల్ని మించి 'ఆర్.ఆర్.ఆర్' కే ఎక్కువ రేటింగ్ రావడం మరో ఆసక్తికరమైన అంశం.

అయితే ఈ లిస్ట్ లో ఇటీవల ఆస్కార్ అవార్డు సాధించిన 'కోడా' చిత్రం మొదటి స్థానంలో ఉండగా.. డెత్ ఆన్ ది నైల్, మార్బియస్, బ్యాట్ మేన్ తర్వాత స్థానాల్లో 'ఆర్.ఆర్.ఆర్' నిలిచింది. ఇకపోతే ఈ లిస్ట్ లో 'ఆర్.ఆర్.ఆర్' మినహా మరో భారతీయ చిత్రానికి స్థానం లేకపోవడం గమనార్హం.కాగా  రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, తారక్, చెర్రీల అభినయ విన్యాసం, అబ్బుర పరిచే గ్రాఫిక్స్ మాయాజాలం ఈ సినిమాను ప్రపంచ చిత్రాల సరసన నిలబెట్టాయని వేరే చెప్పాల్సిన పనిలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: