30 యేళ్ల స్నేహ బంధాన్ని దూరం పెట్టిన బీ టౌన్ స్టార్ హీరో..!!

Divya
తమ మధ్య ఎంత ర్యాపో ఉన్నా కానీ ఒక్కోసారి స్టార్ హీరోలు నిర్మాతలతో విభేదించి దూరం అవుతూ ఉంటారు. అలాగే ఇటీవల ఒక సన్నివేశం బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చకు రావడం జరిగింది.. అదేమిటంటే కబీ ఈద్ కబీ దీపావళి లాంటి భారీ క్రేజీ ప్రాజెక్టులో మొదటిసారి సల్మాన్ స్నేహితుడు సాజిద్ నడియాడ్ వాలా ఉన్నారు. కానీ ఆయన సల్మాన్ ఖాన్ తో భాగస్వామ్యం లేకుండా విడిపోవడానికి గల కారణం ఏమిటి అనేది ఇప్పటివరకు తెలియడం లేదు. వీరిద్దరూ కలసి టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు.
అంతేకాదు టైటిల్ ప్రకటన సమయంలో వీరిద్దరూ కలిసి ఉన్నప్పటికీ.. ఇంతలోనే ఇలా దూరం అవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. ముఖ్యంగా గత పది రోజుల నుంచి కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడంతో పూర్తిగా సందిగ్ధంలో పడిపోయారు.ఇక  వినిపిస్తున్న సమాచారం ప్రకారం స్నేహితుడు సాజిద్ నడియాడ్ వాలా చివరి నిమిషంలో ఈ సోషల్ కామెడీ డ్రామా నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ఇక పోతే ఈ ప్రాజెక్టును సల్మాన్ ఖాన్ నిర్మాణసంస్థ అయినటువంటి సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ స్వాధీనం చేసుకున్నారు..
ఈ సినిమా నుంచి వీరిద్దరి విడిపోవడానికి వేరే కారణం కూడా ఉంది. తడప్, భాఘీ -3 , బచ్చన్ పాండే వంటి కమర్షియల్ చిత్రాలు పొందిన ఫెయిల్యూర్ ని అనుసరించి.. ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందేమో అని ఆయన భావించినట్లు సమాచారం. బడ్జెట్ తో సహా స్క్రిప్ట్ను కూడా మళ్లీ రూపొందించాలని భావించాడట . మరోవైపు సల్మాన్ ఖాన్ కి స్క్రిప్ట్ పై పూర్తి నమ్మకం ఉండటంతో.. అలా స్క్రిప్ట్  విషయంలో ఇద్దరి అభిప్రాయాలు కలవక సాజిద్ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇక సాజిద్ లో సినిమా డిజాస్టర్ అవుతుందనే నమ్మకం ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పైన తన నమ్మకాన్ని ఉంచుకోలేక సినిమా నుంచి వైదొలగడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: