వైరల్: రామ్ చరణ్ సరికొత్త లుక్.. సైకిల్ తొక్కతూ..!!

N.ANJI

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అత్యద్భుతంగా నటించారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. ఈ సినిమా థియేటర్లలో కనక వర్షం కురిపిస్తోంది. ఆల్ టైం రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు.


ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అవడంతో హీరో రామ్ చరణ్ తన నెక్ట్స్ సినిమా ప్రాజెక్ట్‌ పై ఫోకస్ పెట్టారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంటోంది. అయితే తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్‌తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ ఫోటోలో హీరో రామ్ చరణ్ సైకిల్ తొక్కుతూ కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ ఐఏఎస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లుక్‌తో ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్ మొదలైంది. సాధారణ వ్యక్తిలా సైకిల్ తొక్కుతున్న పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు, రామ్ చరణ్ అభిమానులు ఈ ఫోటోను చూసి సంబరపోతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో భిన్న పాత్రలో నటించిన రామ్ చరణ్.. ఈ సినిమాలో ఎలా కనిపిస్తారోనని అభిమానులు వేచి చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అందాల తార కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: