కూతుర్ని హీరోయిన్ గా నిలబెట్టేందుకు.. అతను ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడట?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వారు  తమ వారసులను హీరోహీరోయిన్లుగా తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ వారసులను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడానికి సినీ ప్రముఖులు అందరు కూడా ఎన్నో పాట్లు పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అంతా సవ్యంగా జరిగి ఇలా సినీ ప్రముఖుల వారసులు ఇండస్ట్రీలో బాగా రాణిస్తూ ఉంటే.  కొంతమంది మాత్రం అదృష్టం కలిసి రాక ఇక సరైన స్టార్ డం కోసం పాకులాడుతూ ఉంటారు.

 ఇలా తమ వారసులను నిలబెట్టేందుకు ఇక ఎన్నో ఆస్తులను దారపోస్తూ వుంటారు చాలామంది సినీ నటులు. ఇక్కడ ఓ వ్యక్తి తన కూతురు హీరోయిన్ గా నిలబెట్టేందుకు తన ఆస్తులన్నింటినీ కూడా కూడబెట్టాడు. చివరిరోజుల్లో దీనమైన స్థితిని ఎదుర్కొన్నాడు. అతను ఎవరో కాదు ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి. జనవరి 18, 1954 లో జన్మించిన ఈయన ఇండియాలో ఫోటోగ్రాఫర్ గా ఎంతగానో ప్రఖ్యాతిగాంచారు. ఫ్యాషన్ యాడ్స్ ఫోటో షూట్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఇంకా ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేసి తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడూ.

 అంతేకాకుండా అప్పట్లో స్టార్లుగా కొనసాగిన అనుపం ఖేర్, రేఖ, ఇర్ఫాన్ ఖాన్, మనీషా కొయిరాలా లాంటి వాళ్ళకి పోర్ట్ఫోలియో  ఫోటోలు తీసిన వ్యక్తిగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు  జగదీష్ మాలి. అయితే ఈయనకు అంత్ర మాలి అనే కూతురు ఉంది. ఇండస్ట్రీకు హీరోయిన్గా పరిచయమైంది. సుమంత్ హీరోగా వచ్చిన వర్మ సినిమాతో హీరోయిన్ గా మారింది.ఆ తర్వాత ఖిలాడి 420, రోడ్, గాయం సహా కొన్ని సినిమాల్లో నటించింది. ఇలా ఎన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు. దీంతో కూతురును హీరోయిన్ నిలబెట్టేందుకు జగదీష్ మాలి తన ఆస్తుల మొత్తం ధారపోసాడట. చివరికి ఆర్థిక ఇబ్బందులు కూరుకు పోయాడు. అదేసమయంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అయితే ఇక ఇలా తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో కూతురు అంత్ర మాలి దగ్గర ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ సహాయం చేయడానికి ముందుకు రాలేదట. చివరికి 59 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: