సత్య ప్రకాష్ : హరికృష్ణ డ్రైవింగ్ చూసి భయపడ్డా...!!

murali krishna
ప్రముఖ నటుడు సత్యప్రకాష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. విలన్ గా సత్య ప్రకాష్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సత్య ప్రకాష్ మాట్లాడుతూ వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ని హిట్ సినిమాలలో తాను నటించానని చెప్పుకొచ్చారట.. లాహిరిలాహిరిలాహిరిలో సినిమా దేవదాస్ మూవీ కంటే పెద్ద హిట్ అని సత్యప్రకాష్ వెల్లడించారట.

సీతయ్య అలాగే సీతారామరాజు సినిమాలలో కూడా తాను నటించానని ఆయన వెల్లడించారు. వైవీఎస్ చౌదరి బెస్ట్ డైరెక్టర్ కావడంతో పాటు బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని ఆయన తెలిపారట. సీతారామరాజు సినిమాలో హోలీ రంగోళి అని చెప్పే డైలాగ్ తన కెరీర్ కు బాగా ప్లస్ అయిందని ఆయన వెల్లడించారు. పోకిరి సినిమాలో తనను కట్టేసే సీన్ ఒక రేంజ్ లో క్లిక్ అయిందని ఆయన పేర్కొన్నారట.బాలయ్య మరియు హరికృష్ణ ఇద్దరూ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ అని సత్య ప్రకాష్ వెల్లడించారు.

బాలయ్య బాబుతో ఎంత క్లోజ్ తో ఉంటానో హరికృష్ణతో కూడా తాను ఇంకా ఎక్కువ క్లోజ్ గా ఉండేవాడినని సత్యప్రకాష్ పేర్కొన్నారు. హరికృష్ణతో శ్రీశైలం వరకు జర్నీ చేశానని ఆ తర్వాత ఆయనతో ఎప్పుడూ కూడా జర్నీ చేయకూడదని డిసైడ్ అయ్యానని సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు. హరికృష్ణ దేనినీ కేర్ చేసేవారు కాదని హరికృష్ణ డ్రైవింగ్ కు భయపడి తాను రిటర్న్ జర్నీలో బస్ లో వచ్చానని ఆయన చెప్పుకొచ్చారట.

నందమూరి ఫ్యామిలీ అంటేనే డేరింగ్ అని సత్యప్రకాష్ పేర్కొన్నారు. నాపై బాలయ్య ఇన్ ఫ్లూయెన్స్ బాగా ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. తనపై మెగాస్టార్ ఇన్ ఫ్లూయెన్స్ కూడా ఉందని సత్యప్రకాష్ వెల్లడించారు. ఇండస్ట్రీలో తొక్కేయడం నిజం కాదని ఆయన తెలిపారు. ప్రైమ్ మినిష్టర్ మోదీ నచ్చేవాళ్లు ఎలా ఉంటారో నచ్చనివాళ్లు కూడా అలానే ఉంటారని ఆయన తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: