RRR : భీమ్ పాత్రపై రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్!

Purushottham Vinay
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి దేశావ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ అద్భుతంగా నటించారని ప్రేక్షకులు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విదేశీయులు కూడా మన తెలుగు సినిమాకు బ్రహ్మరథం పడుతూ యుఎస్ లోని డల్లాస్ లాస్ ఎంజిల్స్ కు సంబంధించిన వారు సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రచారం చేస్తున్నారు.దీంతో ఆర్ ఆర్ ఆర్ కు విదేశీయుల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు రాని వారు కూడా తెలుగు సినిమాని చూస్తూ ఈ మూవీని మీరు కూడా చూడండి ఇంకా ఎంకరేజ్ చేయండి అంటూ ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాహుశా ఓ తెలుగు సినిమాకు విదేశీయులు ప్రచారం చేయడం ఇదే మొదటి సారేమో. అయితే ఈ విషయంలో ఆర్ ఆర్ ఆర్ అరుదైన ఘనతని సాధించినట్టే అంటున్నారు ట్రేడ్ జనం.


ఇదిలా వుంటే ఈ సినిమాలోని ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రపై రచయిత రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించారు. ఓ సీన్లో ఆయన నటించిన తీరు ప్రేక్షకుల హృదయాల్ని కదిలించేదిగా వుంది.ఈ సీన్ చూసిన వాళ్లంతా బరువెక్కిన హృదయంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. అంత అద్భుతంగా ఎన్టీఆర్ ఆ సీన్లో జీవించిపోయి నటించి కంటతడి పెట్టించారు. కొమురం భీముడో.. కొమురం భీముడో.. అంటూ సాగే ఆ పాటలో ఎన్టీఆర్ అభినయం స్పీచ్ లెస్ .. అని ది గ్రేట్ రాజమౌళి తండ్రి గారు కొనియాడారు. ఇక వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటిదాకా అన్ని చోట్లా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యింది.ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: