తాత నుంచి నేర్చుకున్నా.. పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా?

praveen
జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఇప్పుడు టాప్ హీరో గా కొనసాగుతున్నాడు. గత కొన్నేళ్ల నుంచి వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ వరుసగా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తో లాక్ అయిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో మరో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

 త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్  కొమరం భీమ్  పాత్రలో నటించారు.. ఇక ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా మెప్పిస్తూ ఇక వసూళ్లలో రికార్డులు కొల్లగొడుతుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో ఉన్న సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఇలాంటి ఒక ప్రశ్న ఎదురైంది. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని అడగగా తనదైన శైలిలో సమాధానం చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్.

 ప్రస్తుతం ఓ నటుడిగా ఈ ప్రయత్నాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాను.. మరు క్షణంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇక భవిష్యత్తులో రాజకీయాలపై ఎలా అంచనా వేయగలం అంటూ చెప్పుకొచ్చాడు. ఒక నటుడిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నానని.. ఇక ప్రస్తుత సమయంలో రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం లేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక మంచి సినిమాలతో అభిమానులను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని తాతగారి నుంచి నేర్చుకున్నాను జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: