మాస్ మహారాజా రవితేజ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, రవితేజ తన కెరియర్ ను చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ఇడియట్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న రవితేజ ఆ తరువాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, కిక్, డాన్ శీను , క్రాక్ వంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు, ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ కొన్ని రోజుల క్రితం ఖిలాడి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది, ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా , రావణాసుర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలతో పాటు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాలో కూడా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, తాజాగా ఈ మొవు కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర బృందం బయటకు వదిలింది. టైగర్ నాగేశ్వర్ రావు ముహూర్తం మరియు ఫ్రీ లుక్ ను ఏప్రిల్ 2 వ తేదీన 12. 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది, ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు, ఈ మూవీ ని అభిషేక అగర్వాల్ నిర్మించబోతున్నాడు. ఈ మూవీ కి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించబోతున్నారు, ఈ సినిమాను తెలుగు , తమిళ , హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.