ప్రభాస్ సరసన మరోసారి నటించనున్న అనుష్క..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనుష్క గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  అందాల ముద్దుగుమ్మ అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అక్కినేని నాగార్జున హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమాలో అనుష్క తన అంద చందాలతో , నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది, మొదటి మొవు తోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కించుకుంది,  ఇలా మొదటి సినిమా తోనే  టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న అనుష్క ,  కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమా ద్వారా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అరుంధతి సినిమా ద్వారా గొప్ప నటిగా అనుష్క పేరు ప్రతిష్ఠలను సంపాదించుకుంది.  

ఇది ఇలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ద్వారా అనుష్క పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది,  ఇలా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది,  కాకపోతే ఈ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుష్క కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే,  ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు ఉండబోతున్నారు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.  అయితే ఈ ముగ్గురు హీరోయిన్ లలో అనుష్క ను మెయిన్ హీరోయిన్ గా చిత్ర బృందం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది,  ఇక  తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో అనుష్క కూడా ఈ మూవీ కి ఒకే చేపినట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: