సాయి ధరమ్ తేజ్ కు గుడ్ లక్ చెప్పిన వరుణ్ తేజ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, సాయి ధరమ్ తేజ్ కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా మాస్ సినిమాల్లో నటిస్తూ మాస్ హీరోగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు,  సాయి ధరమ్ తేజ్  టాలీవుడ్ ఇండస్ట్రీ లో పిల్లా నువ్వు లేని జీవితం , సుప్రీమ్ ,  సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , చిత్రలహరి ,  ప్రతి రోజు పండగే వంటి విజయవంతమైన మూవీ లతో  హీరో గా  మంచి గుర్తింపు ను సంపాదిం చుకున్నాడు.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్  'రిపబ్లిక్'  సినిమా విడుదల కి సిద్ధమైన సమయం లో  రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు,  సాయి ధరమ్ తేజ్  ఆ ఆక్సిడెంట్ కారణంగా  చాలా రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండవలసి వచ్చింది , సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకొని ఎప్పుడు సెట్స్ పైకి వెళతాడా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.  

ఈ నేపథ్యం లో సాయి ధరమ్ తేజ్ తన తాజా సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లాడు,  చాలా రోజుల గ్యాప్ తర్వాత సాయి ధరమ్ తేజ్ మళ్లీ కెమెరా ముందుకు వెళ్ళాడు.  బీవీఎస్ ఎన్ ప్రసాద్ ,  సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు,  ఈ సందర్భం గా వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ మళ్లీ నువ్వు సెట్స్ పైకి రావడమనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది బావా. లవ్ యూ... మోర్ పవర్ ... గుడ్ లక్" అంటూ సాయి ధరమ్ తేజ్ లో మనో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశాడు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: