టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ హీరో (ఎస్ ఎం ఎస్) శివ మనసులో శృతి మూవీ తో హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను సాధించుకోవడంతో పాటు సుధీర్ బాబు కు కూడా ఈ మూవీ మంచి గుర్తింపు ను తీసుకుని వచ్చింది, (ఎస్ ఎం ఎస్) శివ మనసులో శృతి మూవీ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ బాబు ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ప్రేమ కథ చిత్రమ్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సుధీర్ బాబు కు ఆ తర్వాత మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సుధీర్ బాబు 'శ్రీ దేవి సోడా సెంటర్' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
కాకపోతే ఈ సినిమా కూడా సుధీర్ బాబు కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది, ఇది ఇలా ఉంటే సుధీర్ బాబు ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది, ఇలా ప్రస్తుతం ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సుధీర్ బాబు మరో కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీ కి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ మూవీ సుధీర్ బాబు కెరియర్ పరంగా 16 వ సినిమా, ఇలా సుధీర్ బాబు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించాడు.