వైరల్ : త్రిబుల్ ఆర్ కోసం.. చరణ్ ఇంత కష్టపడ్డాడా?

praveen
రాజమౌళి సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న  సినిమాలు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. ఎందుకంటే భారీ బడ్జెట్తో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో ఇక అటు రాజమౌళి పై మరింత బాధ్యత పెరిగిపోతూ ఉంది.

 ఈ క్రమంలోనే తన సినిమాలో ప్రతి విషయంపై కూడా ఎంతో కచ్చితత్వంతో కాస్త కఠినంగానే ఉంటారు రాజమౌళి. ఏకంగా రాజమౌళి సినిమాల్లో హీరోలు విలన్లు కాస్త బాడీ పెంచి సిక్స్ ప్యాక్ తో కనిపించడం చూస్తూ ఉంటాం. త్రిబుల్ ఆర్ సినిమా లో కూడా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తే అటు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కూడా తమ నట విశ్వరూపం చూపించారు అని చెప్పాలి.

 ఇకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు.. బాక్సింగ్ సన్నివేశాలలో ఎంతో ప్రొఫెషనల్గా కనిపించేందుకు రామ్చరణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు అని తెలుస్తోంది. ఇక బాక్సింగ్ ఎపిసోడ్ తక్కువగా ఉన్నప్పటికీ చరణ్ మాత్రం దీని కోసం ఎంతో చెమటోడ్చి పని చేశాడు అన్నది  అర్థమవుతుంది. ఇక ఇటీవలే అందుకు సంబంధించిన వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. బాక్సింగ్ ట్రైనర్ నీరజ్ గోయాంక్
 సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: