RRR: జక్కన్న గతి తప్పాడు... కారణం ఇదే?
వాస్తవానికి ఈ సినిమా లైన్ రెవీల్ చేసిన క్షణం నుండి అంచనాలు భారీగా పెరిగాయి. ఎందుకంటే స్వాతంత్ర్య సమరయోధులు అయిన అల్లూరు సీతారామరాజు మరియు కొమురం భీం కథలు కావడం వలన, అయితే సినిమాలో మాత్రం పూర్తిగా వేరేగా ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి లైన్ ను ఏదైనా ఒకవైపుకు లాక్కుని వెళ్లలేకపోయాడు. తనకు తానే ఇది దేశభక్తి సినిమానా లేదా కమర్షియల్ సినిమానా అన్న సందిగ్ధంలో పడ్డాడు. దీనితో సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు లీనం కాలేకపోయాడన్నది వాస్తవం. దేశభక్తి కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు పూర్తిగా దానికి మాత్రమే కట్టుబడి ఉండాలి.
సినిమాలో ఉన్న అన్ని ప్రధాన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ప్రేక్షకులు మంచి దేశభక్తి సినిమా చూశాము అన్న భావన అయితే కరువయింది ఘంటాపధంగా చెప్పవచ్చు. ఈ సినిమా రిలీజ్ కు ముందు నుండి చెప్పుకున్న విధంగానే కలెక్షన్ లకు ఎటువంటి ఢోకా లేదు? కానీ సినిమా టాక్ ఎలా ఉంటుంది అని అనుకున్నాము. కానీ ఖచ్చితంగా బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇటువంటి సినిమాను రాజమౌళి నుండి ఆశించలేదు అని బయట టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో మొదటిసారి రాజమౌళి గతి తప్పదు అని తెలుస్తోంది..