ఎమోషనల్ అయిన ప్రణీత.. ఎందుకో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమ లో హీరోయిన్ ప్రణీతకు ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా కొన్ని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తన అందం అభినయం తో ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా కొనసాగుతున్న వారి సినిమాల్లో సైతం ప్రత్యేకమైన పాత్రలో అలరించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు తెలుగు తో పాటు కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటిస్తోంది ప్రణీత. అయితే ఈ అమ్మడు సినిమా లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది అనే విషయం తెలిసిందే.

 ఇక ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది ఈ సొగసరి. అంతేకాదు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది హీరోయిన్ ప్రణీత. ఇకపోతే ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది ఈ హీరోయిన్. హీరోయిన్ల జీవితాలు కష్టాలు ఎలా ఉంటాయి అనే విషయాలను ప్రస్తావిస్తూ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది.

ఇక్కడ జీవితాలకు అస్సలు గ్యారెంటీ ఉండదు.. మా జీవితాలు అన్నీ కూడా అంధకారం తో నిండి ఉంటాయి.. సక్సెస్ ఎంత తొందరగా చూస్తామో.. ఫెయిల్యూర్ కూడా అంతే తక్కువ టైమ్ లో చూస్తూ ఉంటాం.. ఇటు గౌరవం లేని జీవితాలు గడుపుతూ ఉంటాం.. పగలు రాత్రి అనే తేడా లేకుండా చలికి వణుకుతూ ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాం.. ఇక మేము అందరం ఎంతో కష్టపడి ఇదంతా చేసేది ప్రేక్షకుడిని సంతోషపెట్టే ఒక్క క్షణం కోసమే అంటూ ఇటీవల ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ప్రణీత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: