ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' అంటే అర్థం అదేనట..!

Anilkumar
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని డార్లింగ్ ఫాన్స్ ని నిరాశపరిచింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ అతని నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ చూపు మొత్తం 'ప్రాజెక్టు కే' సినిమాపైనే ఉంది. మహానటి సినిమా తో సంచలన విజయాన్ని అందుకొని ఆడియన్స్ చేత కంటతడి పెట్టించిన యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. 

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెండు భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రాజెక్ట్ కే అని చెప్పడమే గానీ అందులో కె అంటే ఏంటి అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అందరికీ తెలిసినట్టు ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా కాదట. మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రను తీసుకొని దాని చుట్టూ అల్లుకున్న కథే ప్రాజెక్ట్ కే అని తెలుస్తుంది.

ఆ రెండు పాత్రలు ఏంటంటే ఒకటి విష్ణుమూర్తి.. అవతారం మరొకటి అశ్వద్ధామ అవతారం.. కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కి గా అవతరించాడు. ఇప్పుడు అదే పాత్రను ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్నాడట. అంటే కె అంటే కల్కి అని అర్థమట. అశ్వద్ధామ గా అమితాబచ్చన్ కనిపించనున్నారని చెబుతున్నారు. కల్కి అంటే తెల్లటి గుర్రంపై వీర ఖడ్గం పట్టుకొని దుష్ట సంహారం చేసే అవతారం. దీన్ని బేస్ చేసుకుని దానికి సైన్స్ ని కలిపి ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చేంత వరకు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: