గ్యాస్ సిలిండర్ తీసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు ఉచితం..ఎక్కడంటే?

Satvika
ఆర్ఆర్ఆర్ మేనియా ప్రపంచం అంతా కొనసాగుతుంది.. మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా టిక్కెట్ల ను ఆఫర్ల కింద అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలు టిక్కెట్లను అందించాయి. తాజాగా ఓ గ్యాస్ కంపెనీ రెండో సిలిండర్ తీసుకుంటే సినిమా టిక్కెట్లను ఉచితం అని ప్రకటించాయి. ఇది ఇప్పుడు ఆ ప్రాంతంలో వైరల్ అవుతుంది. అంతే కాదు ఆ ప్రకటనకు మంచి స్పందన కూడా వచ్చింది.గతంలో బాహుబలి-2 చిత్రం సమయంలోనూ ఇలాగే ఫ్రీ టికెట్లు ప్రకటించింది. తాజా ప్రకటన చేసిన కాసేపటికే మూడు సెకండ్ సిలిండర్లు బుక్ అయ్యాయని సదరు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెల్లడించారు..


వివరాల్లొకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఈ ప్రచారం జరుగుతుంది..దుగ్గిరాలలోని హెచ్.పి కంపెనీ గ్యాస్ డీలర్ ఈ ఆఫర్ తీసుకువచ్చారు. సింగిల్ సిలిండర్ వినియోగదారులు రెండో సిలిండర్ తీసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్ ను ఉచితంగా ఇస్తామని బ్యానర్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. సినిమా విడుదల అయిన రోజున ఇలా టిక్కెట్లను ఇంటికి వచ్చి ఇస్తామని చెబుథున్నారు. ఈ ఏజెన్సీ గతంలో బాహుబలి-2 చిత్రం సమయంలోనూ ఇలాగే ఫ్రీ టికెట్లు ప్రకటించింది.దుగ్గిరాల సరోజిని థియేటర్ లో వారు ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు టికెట్లను ఇంటికి వెళ్లి అందిస్తామని తెలిపారు..


కాగా, ఈ సినిమా టిక్కెట్లను పెంచుకొవచ్చు అని ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ సినిమాను రూపొందించడానికి 336 కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని అంటున్నారు.సినిమా టికెట్ల ధరల పెంపు ప్రజలపై భారం లేకుండా చూస్తామని కూడా ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని ఇటీవలనే ప్రకటించారు.. మొత్తానికి ఈ సినిమా పై ధరలను పెంచారు.దాంతో హీరో ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 25 న సినిమా విడుదల కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: