ఆ విషయంలో ఆర్జివి ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రాజమౌళి...!!

murali krishna
రాజమౌళి సినిమాలు ఎంత కాన్ఫిడెంట్ గా తీస్తాడో.. ఆయన మాటలు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంటాయని అందరికి తెలుసు.కానీ గమ్మత్తు ఏమిటో తెలుసా రాజమౌళి ఒక్కోసారి ఏమి చేయలేను అంటాడో..అదే చేస్తాడు.
ప్రభాస్ డార్లింగ్ సినిమా చూసిన రాజమౌళి.. ప్రభాస్ తో ' ఓ హీరో హీరోయిన్ వెనుకాల ప్రేమ ప్రేమ అంటూ ఎలా పడతాడు. నా సినిమాల్లో అయితే అలాంటివి అస్సలు పెట్టలేను' అని అన్నాడని తెలుస్తుంది.కట్ చేస్తే 'మగధీర' సినిమాలో రాంచరణ్ మరియు కాజల్ వెంట పడుతున్నట్టు చేసాడు రాజమౌళి. మరి అప్పుడు నువ్వు అన్న మాటేంటి అని ప్రభాస్ అడిగితే.. 'నువ్వు చెడగొట్టావ్' అంటూ ప్రభాస్ పై తోసేసాడట.. తాజాగా 'ఆర్.ఆర్.ఆర్' ప్రమోషన్లలో పాల్గొన్న రాజమౌళికి అలాంటి ప్రశ్న మరొకసారి ఎదురైంది.
 
'మగధీర' టైములో ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ నేను అస్సలు హ్యాండిల్ చేయలేను.భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టుల జోలికి అస్సలు వెళ్ళను అంటూ రాజమౌళి చెప్పాడు. తర్వాత 'మర్యాదరామన్న' 'ఈగ' వంటి స్మాల్ స్కేల్ మూవీస్ కూడా చేసాడు. కానీ అటు తర్వాత 'మగధీర' ని మించి 'బాహుబలి'(సిరీస్) కూడా చేసాడు. ఇప్పుడు దానిని మించి 'ఆర్.ఆర్.ఆర్' కూడా చేసాడు. 'దీనికి మీ స్పందన ఏంటి?' అంటూ ఓ విలేఖరి రాజమౌళిని ప్రశ్నించాడట..
 
దానికి రాజమౌళి.. 'ఆ టైములో రాంగోపాల్ వర్మని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఓ మంచి అబద్దం చెప్పాను' అంటూ సింపుల్ గా మాట దాటేశాడట.ఇలా అప్పుడు ప్రభాస్ పైకి ఇప్పుడు ఆర్జీవీ పైకి తోసేసి తెలివిగా తప్పించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి..!!.అబద్దాలు చెప్పడంలో ఆర్జీవీ దిట్ట. చెప్పింది అబద్దమని తనకు తెలిసిన కూడా తనను తాను బాగా సమర్ధించుకుంటాడు. అదే విధముగా రాజమౌళి కూడా రామ్ గోపాల్ వర్మ డైలాగ్ చెప్పాడు. ఎదుటి వారికీ ఎలాంటి సమాధానం చెప్పాలి అనేది రాజమౌళికి బాగా తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: