ఆ సమస్యతో బాధ పడుతున్న రామ్ పోతినేని..?

Anilkumar
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కి వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అంతేకాకుండా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రామ్ తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలోది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ మొట్టమొదటిసారి ఒక తమిళ దర్శకుడితో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక  ఈ సినిమా  తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది.

ఇకపోతే ఈ సినిమాలో  రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుండగా.. దానితో పాటు విలన్ గా యంగ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఈ భారీ రెస్పాన్స్ ని అందుకుంది ఈ సినిమాకోసం రామ్ సరికొత్త మేకోవర్ తో రాబోతున్నాడు శరవేగంగా షూటింగ్ ఇప్పటికే జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే ఇక ఈ సినిమాలో రామ్ మతిమరుపు ఉన్న పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు అయితే దాంతో చేసే కొన్ని పొరపాట్లు కారణంగా ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది అని తెలుస్తోంది.

ఇకపోతే  చివరికి ఒక కేసులో ఈ మతిమరుపు వలన రామ్ చేసిన పొరపాటు ఏంటి..? ఇక దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు అనేది కథగా తెలుస్తోంది. అంతేకాదు కామెడీ చేయడంలో రామ్ రూటే వేరు.. రెడీ, కందిరీగ చిత్రాల్లో రామ్ కామెడీ అల్టిమేట్ అని చెప్పాలి. అయితే మరి ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ ఏ విధంగా కామెడీ చేస్తాడో చూడాలి..ఈ సినిమా అనంతరం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: