బాలయ్య సినిమాల పై ఏమన్నారో తెలుసా?

Satvika
తెలుగు స్టార్ హీరో నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ సినిమాల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. మాస్, యాక్షన్, అదిరిపొయె డైలాగులు అన్న విషయం తెలిసిందే.. మాస్ ప్రేక్షకులకు బాలయ్య సినిమాలు కన్నుల విందు అనే చెప్పాలి.ఆయన తో అలాంటి యాక్షన్ సినిమాలను చేయడానికి డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. బాలయ్య గతంలో బయోపిక్ సినిమాలను చేశారు. కానీ ఎ సినిమా కూడా అతనికి ప్లస్ అవ్వలేదు. దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాలొ నటించారు.. ఆ సినిమాను బోయపాటి శీను తెరకెక్కించారు.


ఆ సినిమానె అఖండ.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 రోజులు పూర్తీ చేసుకుంది. రెండు ,మూడేళ్లగా ఒక్క హిట్ సినిమా లేని చిత్ర పరిశ్రమకు ఈ సినిమా కనక వర్షాన్ని కురిపించింది.. బాక్సాఫీస్ వద్ద రికార్దులను బ్రేక్ చేసింది. మంచి టాక్ తో పాటుగా, కలెక్షన్స్ కూడా అందుకుంది. ఈ మేరకు వందరోజుల వేడుకను కర్నూలులో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. శనివారం సాయంత్రం వంద రోజులు ఫంక్షన్ ను కర్నూలు లో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ తో సహా బాలయ్య కూడా హాజరయ్యారు..


ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు.. కరోనా వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి సినిమా షూటింగ్ విజయ వంతంగా పూర్తీ చేసుకొని విడుదల అయింది.. సినిమాను ఇంత విజయవంతం కావడానికి సహకరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడం నా అదృష్టం.. నా సినిమాలకు నా సినిమాలే పోటీ అని ఆయన అన్నారు.శివతాండవం చేసేటప్పుడు థమన్ ఇచ్చిన ధ్వనితో అమెరికాలోని థియేటర్ల స్పీకర్‌లు బద్దలై సునామి సృష్టించాయి..ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం కోసం అభిమానులు ఎంతో సహకరించారు.. ఇలాగే మంచి సినిమాలను ప్రేక్షకుల అందిస్తాను అని బాలయ్యా అన్నారు.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాల లో నటిస్తూ బిజిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: