షాక్: సమంత మరీ ఇంతలా అయితే ఎలా..?

Divya
సమంత ప్రస్తుతం తన సినిమాలు చేసుకుంటూ.. తన పర్సనల్ లైఫ్ జీవితంలో కూడా చాలా బిజీగా ఉంటోంది. మరోవైపు తన వ్యాపారాలను కూడా చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా కొద్ది రోజుల క్రితం తన స్నేహితురాలు అయిన శిల్పా రెడ్డి సంస్థలలో కాస్త ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు అనేక సంస్థలలో కూడా సమంత ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రకటించడం జరిగింది.. తాజాగా సమంత ఒక యాడ్ ను చేసింది.. దీంతో ఆమెపై పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు వాటి గురించి చూద్దాం.
సమంత ఇప్పుడు ఆల్కహాల్ కు సంబంధించి ఒక ప్రకటనలో నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్లు సైతం ఇలాంటి బ్రాండ్స్ పైన ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటారు. ఇదివరకు కూడా పూజా హెగ్డే, ఇలియానా, రెజీనా వంటి హీరోయిన్లు ఇలాంటి ఆల్కహాల్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు సమంత కూడా వీరు లిస్టులో చేరింది. సమంత విస్కీని ప్రమోట్ చేస్తోంది. బ్లెండర్ ప్రైడ్ కు సంబంధించిన బ్రాండ్లను ప్రోత్సహిస్తోంది. దీంతో సమంత ప్రకటన చాలా శృతి మించి పోయింది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

సమంత షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే హాట్ డోస్ సమంత పెంచిందంన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా సమంత మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆ వీడియో రెండు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక సమంత తను గర్వం, అహంకారంతో పెరిగాను కాబట్టి నేను మరణించడాన్ని కైనా సిద్ధంగా ఉన్నాను.. అందుకోసం మీరు కూడా కదలండి అంటూ సమంత బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్ గురించి తెలియజేసింది. ఇక ఈ ఈ లాంటి పలు గ్రాండ్ సంస్థల్లో కూడా సమంత బాగానే సంపాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: