చిరంజీవి - రాజశేఖర్ మధ్య గొడవలకు ఆ సినిమానే కారణమా..?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవిమెగా కుటుంబానికి మరియు యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్‌కు మధ్య ఏవేవో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి 2009లో  ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇవి బాగా బహిర్గతం అవ్వడం జరిగింది.ఇక గతంలో రాజశేఖర్‌, జీవిత దంపతులపై భీమవరంలో మెగా అభిమానులు రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.ఇకపోతే  వీరిద్దరి గొడవలకు ఈ రాజకీయ విబేధాలే కారణం కాదు.. అసలు విషయం ఏమిటంటే అంతకు ముందు ఓ సినిమా కారణమైంది. అయితే ఆ సినిమానే  చిరంజీవి నటించిన ఠాగూర్‌. ఇకపోతే తెలుగులో వినాయక్ దర్శకత్వంలో చిరు హీరోగా వచ్చిన ఠాగూర్ 192 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళంలో వచ్చిన రమణ. అంతేకాదు విజయ్‌కాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆషియాభల్లా హీరోయిన్‌గా నటించింది. ఇకపోతే  అప్పట్లో రమణ సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం హీరో రాజశేఖర్ ముందుగా అక్కడ నిర్మాతలను సంప్రదించడం జరిగింది.ఇక అప్పుడు పోటీ లేకపోవడంతో అక్కడ నిర్మాతలు ఆ రీమేక్ రైట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. అయితే  ఈ లోగా ఈ సినిమా చిరు రీమేక్ చేస్తే బాగుంటుందని కొందరు ఆయనకు సలహా ఇవ్వడం.. దానిత్తో వెంటనే చిరు రమణ చూడడం.. కాగా ఆయన ఓకే చెప్పేయడం..

అల్లు అరవింద్ మంత్రాంగం చేసి రమణ తెలుగు రీమేక్ రైట్స్ లియో ప్రాజెక్ట్ మధుకు దక్కేలా చేశారట .అయితే రాజశేఖర్ ఈ సినిమా చూసి నచ్చిందనుకుని అగ్రిమెంట్ చేసుకునే లోపలే ఇదంతా జరిగిపోయింది.అయితే ఇదే రాజశేఖర్‌, చిరు మధ్య వైరానికి తొలి బీజంగా మారింది. ఇకపోతే ఈ గొడవకు చిరుకు సంబంధం లేదు.ఇకపోతే  ఆయన ప్రమేయం లేకుండానే తెరవెనక కథ నడిచింది. అయితే చిరు నటిస్తారని చెప్పడంతో రమణ నిర్మాతలు కూడా ఆ రైట్స్ లియో ప్రాజెక్ట్ మధుకే ఇచ్చారు. కాగా ఆ తర్వాత రమణను తెలుగులో రీమేక్ చేస్తే సూపర్ హిట్ అవ్వడంతో పాటు చిరంజీవికి మంచి పేరు తీసుకువచ్చింది. అయితే అప్పటి నుంచే రాజశేఖర్ చిరు మధ్య స్టార్ట్ అయిన గొడవలు చిరు పార్టీ పెట్టినటైంకు పీక్స్ కు చేరుకున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: