విక్రమ్ క్రేజీ సినిమా.. విముక్తి దొరికిందా!!

P.Nishanth Kumar
విక్రమ్ హీరోగా నటించిన సినిమా ఆర్థిక కారణాల వల్ల వాయిదా వేసుకుంటుంది అని ఎవరు కూడా అనుకోరు. తమిళనాడులోనే మంచి క్రేజ్ ఉన్న హీరో గా విక్రమ్ కు ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటి ఈ హీరో గౌతమ్ మీనన్ తో కలిసి నటించిన ఓ సినిమా ఎప్పుడో పూర్తి చేసినా కూడా ఇప్పటివరకు విడుదల చేయకుండా ఉంచారు. సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడి గా ఉన్న గౌతమ్ సినిమాలు భారీ స్థాయిలో అందరినీ అలరిస్తూ ఉంటాయి. ప్రేమకథ సినిమాలను ఎంతో విభిన్నంగా తెరకెక్కించే దర్శకుడు తెరపై ఆవిష్కరించే విధానం పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటారు.

అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇతర దర్శకుల కంటే భిన్నంగా ఉండే విధంగా సినిమాలు చేసి ఇప్పటివరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. అలాంటి ఈ దర్శకుడు విక్రమ్ తో కలిసి చేసిన ధ్రువ నక్షత్రం సినిమా చాలా రోజుల క్రితమే పూర్తి చేసినా ఇప్పటివరకు విడుదల చేయలేదు. వాస్తవానికి ఈ సినిమా సూర్య మరియు దీపిక చేయాలని ఆయన భావించారు. కానీ డేట్స్ కారణం వా ఈ సినిమా నుంచి వీరిద్దరూ కూడా తప్పుకున్నారు.

దాంతో చివరకు విక్రమ్ రీతు వర్మ లతో కలిసి ఈ సినిమా చేశాడు గౌతమ్. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా ను విడుదల చేయాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక కారణం అడ్డుతగిలి ఈ చిత్రం విడుదల ఆగిపోతుంది. దాంతో ఈ సారి తప్పకుండా ఈ సినిమా ను విడుదల చేయాలనే ఉద్దేశంతో త్వర్ త్వరగా పూర్తి చేసి ఈ వేసవికి సినిమా వచ్చేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడు. ఇంతకాలం ఎంతో పూరించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవడం అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.  మరి ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: