యాక్షన్ హీరోలుగా మారడానికి యంగ్ హీరోల పాట్లు..!

Purushottham Vinay
ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోగా ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా యాక్షన్ హీరో గుర్తింపుని పొందాలి. ఎందుకంటే ఆ ఇమేజ్ వున్న హీరోలే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం స్టార్స్ గా నిలదొక్కుకోగలరు.అయితే కొంతమంది యంగ్ హీరోలకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వున్న మాస్ సినిమాలతో మెప్పించలేకపోతున్నారు. ఇక ఇలా యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేక పాట్లు పడుతున్న ఆ టాలీవుడ్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నాచురల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నాని. ఇక తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవలే టక్ జగదీష్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో జనాల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా నాని కెరీర్ కు మాత్రం అసలు మైలేజ్ అనేది ఇవ్వలేకపోయిందని చెప్పాలి.ఇక ఎప్పుడూ సరికొత్త సినిమాలు చేయడంలో ముందుండే శర్వానంద్ రణరంగం మహాసముద్రం లాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కూడా కొన్ని సినిమాలు చేశాడు. కానీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అదే టైం లో మహానుభావుడు, శతమానం భవతి ఇలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.

సాఫ్ట్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్ ను ఇంకా లవర్ బాయ్ గానే ఊహించుకుంటారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఒక్కసారిగా రూట్ మార్చి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ సినిమాలన్ని డిజాస్టర్ గా మిగిలిపోయాయి.. తర్వాత రంగ్ దే ఇంకా మాస్ట్రో సినిమాలు కూడా ఎక్కడా కనిపించకుండా పోయాయి. దీంతో మళ్లీ యాక్షన్ సినిమాల జోలికి పోవద్దని నిర్ణయించుకున్నాడు నితిన్. ఇక తన కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి యాక్షన్ కు ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చిన అక్కినేని హీరో అఖిల్ కు ఏ యాక్షన్ మూవీ కూడా పేరు కాదు కదా కనీసం ఓ మోస్తారు హిట్ ని కూడా తీసుకురాలేపోయింది . చివరికి ఇటీవలే రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒక మోస్తరు విజయాన్ని సాధించింది.ఇలా ఈ హీరోలు యాక్షన్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోడానికి తెగ పాట్లు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: