సెబాస్టియన్ PC 524 : రివ్యూ

shami
రాజా వారు రాణి గారు.. SR కళ్యాణమండపం సినిమాలతో యువ హీరోగా తన ప్రతిభ చాటుకున్న కిరణ్ అబ్బవరం తన థర్డ్ మూవీ సెబాస్టియన్ పిసీ 524 సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచార చిత్రలతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచుకున్న సెబాస్టియన్ సినిమా ఆశించిన స్థాయిలో ఉందా లేదా అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
రేచీకటితో బాధపడుతున్న సెబాస్టియన్ తల్లిదండ్రుల కోరిక మేరకు పోలీస్ జాబ్ సంపాదిస్తాడు. అప్పటివరకు తన రేచీకటితో ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను పోలీస్ స్టేషన్ లో కూడా కేవలం మార్నింగ్ డ్యూటీలతో నెట్టుకొస్తాడు. ఈ టైం లో అతనికి ఒకసారి నైట్ డ్యూటీ వేస్తారు. ఆ టైం లోనే ఆపదలో ఉన్న నీలిమ (కోమలీ ప్రసాద్)ని కాపాడలేకపోతాడు. ఆమె హత్య కేసుకి సంబందించిన ఆధారాలు కూడా తన నైట్ బ్లైండ్ నెస్ వల్ల కాపాడలేకపోతాడు. ఈ టైం లో అతన్ని సస్పెండ్ చేస్తారు. ఆ కేసుని ఛేధించే క్రమంలో సెబాస్టియన్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
రాజా వారు రాణి గారు.. SR కళ్యాణమండపం చేసిన రెండు సినిమాలతోనే తన టాలెంట్ ఏంటో చూపించిన కిరణ్ సెబాస్టియన్ తో హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నాడు. సెబాస్టియన్ సినిమాలో అతని పర్ఫార్మెన్స్.. కామెడీ టైమింగ్.. యాక్షన్ అంతా బాగుంది. అయితే డైరక్టర్ క్లారిటీ లేకపోవడం వల్ల సినిమా గాడి తప్పింది.
సెబాస్టియన్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న తీరు పూర్తిగా సినిమా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. థ్రిల్లర్ అంశాలతో పాటుగా హీరోకి నైట్ బ్లైండ్ నెస్ అనే లోపం పెట్టి ఆడియెన్స్ కి ఓ మంచి సినిమా అందించే అవకాశం ఉన్నా సరే ఫస్ట్ హాఫ్ వరకు బాగా నడిపించిన డైరక్టర్ సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పాడు.
సినిమా ఫస్ట్ హాఫ్ ప్లస్ కాగా సెకండ్ హాఫ్ మైనస్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కొద్దిగా బెటర్ గానే అనిపిస్తుంది. అయితే అప్పటికే సినిమా మీద ఆడియెన్స్ కు నెగటివ్ ఇంప్యాక్ట్ ఏర్పడుతుంది. ఫైనల్ గా మరీ బోర్ కొడితే ఒకసారి చూసే సినిమాగా సెబాస్టియన్ ఉంది.
నటీనటుల ప్రతిభ :
సెబాస్టియన్ గా తన నటనతో మెప్పించాడు కిరణ్ అబ్బవరం. సరైన సినిమా పడాలే కానీ కుర్రాడు ఓ రేంజ్ కి వెళ్తాడనిపించేలా అతని నటన ఉంది. హీరోయిన్ నువేక్షకి ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్ర ఇచ్చారు. కోమలీ ప్రసాద్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు :
రాజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. జిబ్రాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. బిజిఎం ఆకట్టుకుంది. డైరక్టర్ బాలాజి కథ బాగానే రాసుకున్నా కథనం విషయంలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లాగానే సెకండ్ హాఫ్ కూడా గ్రిప్పింగ్ గా ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కిరణ్ అబ్బవరం టైమింగ్
జిబ్రాన్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కథనం
సెకండ్ హాఫ్
బాటం లైన్ :
సెబాస్టియన్.. ఆశించిన స్థాయిలో లేదు..!
రేటింగ్ : 2/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: