ధమాకా సినిమా నాలుగవ షెడ్యూల్ షూటింగ్ పూర్తి ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ధమాకా సినిమా ఒకటి,  ఈ సినిమాకు సినిమా చూపిస్త మామ,  నేను లోకల్ , హలో గురు ప్రేమకోసమే సినిమా లతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో పెళ్లి సందD సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల ధమాకా సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది,  ఇప్పటికే ధమాకా సినిమా నుండి వాలెంటెన్స్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  ధమాకా సినిమా డబల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోంది,  ఏఏఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణం లో ధమాకా సినిమా తెరకెక్కుతోంది,  ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది,  ఇది ఇలా ఉంటే తాజాగా ధమాకా సినిమాకు సంబంధించిన  నాలుగవ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.  రవితేజ, జయరాం, శ్రావణ్, సమీర్ తదితర నటులు, చిత్ర బృందం లోని మొత్తం సభ్యులు  దిగిన ఫోటో ను ఈ సందర్భంగా చిత్ర బృందం షేర్ చేసింది. త్వరలోనే ధమాకా సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది,  ఈ సినిమాను దర్శకుడు కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇది ఇలా ఉంటే రవితేజ ఈ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర  సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు,  అలాగే టైగర్ నాగేశ్వరావు సినిమాలో కూడా రవితేజ నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు, ఇది ఇలా ఉంటే రవితేజ నటించిన ఖిలాడి సినిమా ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: