శర్వానంద్ కు ఈసారైనా హిట్ దక్కేనా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి కొంత మంది చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ ఎంట్రీ ఇస్తూ ఉంటారు,  అలా చిన్న చిన్న పాత్రలు వేస్తూ తమను తాము నటుడిగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో కొంత మంది క్రేజీ హీరో లుగా మారుతూ ఉంటారు,  అలా కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ,  ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని,  అలా హీరోగా నటించిన సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో గా మారిన నటులలో శర్వానంద్ ఒకరు.  టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు,  ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్న ఈ నటుడు అందులో భాగంగా నటించిన ప్రస్థానం,  రన్ రాజా రన్,  ఎక్స్ ప్రెస్ రాజా,  శతమానం భవతి లాంటి విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు.  

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిన శర్వానంద్ గత కొద్ది కాలంగా మాత్రం విజయాలను అందుకోవడం లో కాస్త స్లో అయ్యాడు,  శర్వానంద్ చివరిగా నటించిన పడి పడి లేచే మనసు,  రణరంగం,  జాను,  శ్రీకారం,  మహా సముద్రం సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ హీరోకు నిరాశను మిగిల్చాయి.  ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన శర్వానంద్ ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో నటించాడు, ఈ సినిమా మార్చి 4 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది,  అలాగే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రాధిక, కుష్బూ ముఖ్యమైన పాత్రలు పోషించారు.  ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన  ప్రచార చిత్రాల ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి,  మరి ఇలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: