జానీ మాస్టర్ ను ఫిదా చేసిన డాన్స్.. గూస్ బమ్స్ పర్ఫామెన్స్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. ప్రతి పాటలో కూడా తనదైన శైలిలో డాన్స్ సమకూరుస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  ఇటీవలికాలంలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తెలుగులోనే కాదు తమిళ కన్నడ భాషల్లో కూడా కొరియోగ్రఫీ తో అదరగొడుతున్నాడు జానీ మాస్టర్. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్న జానీ మాస్టర్ సాధారణంగా ఏదైనా పర్ఫామెన్స్ నచ్చింది అని చెప్పడం మాత్రం చాలా అరుదుగానే జరుగుతుంది. ఇటీవల ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు జానీ మాస్టర్.

 ప్రస్తుతం ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న జానీ మాస్టర్ ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ లో జడ్జిగా వస్తున్నాడు. ఢీ షో లో భాగంగా కంటెస్టెంట్స్ చేసే డాన్స్ పర్ఫార్మెన్స్ పై తనదైన శైలిలో జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే జానీ మాస్టర్ ఢీ షో లో భాగంగా ఒక పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయాడు. జడ్జ్ సిటీ నుంచి ప్రశంసించడమే కాదు స్టేజి మీదికి వెళ్లి డాన్స్ చేసిన కంటెస్టెంట్ ను దగ్గరికి తీసుకుని ప్రశంసించాడు. ఇటీవల విడుదలైన ఢీ షోకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. ఈ ప్రోమో లో భాగంగా ఎప్పటిలాగానే అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారూ కంటెస్టెంట్స్.

 ఎప్పటిలాగానే ఇక అటు కామెడీ కూడా అందరినీ కడుపుబ్బ నవ్వించింది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆడపిల్లలు నేటి రోజుల్లో ఎదుర్కొంటున్న వేధింపులను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తు..  ఆడపిల్లలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ లో చూపించారు. ఇక ఇది చూసిన జానీ మాస్టర్ ఒక్కసారిగా ఫిదా అయిపోయారు.. జడ్జిమెంట్ సమయంలో విజిల్ వేసి ప్రశంసలు కురిపించాడు. అతంటితో ఆగకుండా స్టేజి మీదికి వెళ్ళి కంటెస్టెంట్ నీ దగ్గరికి తీసుకుని ప్రశంసించాడు జానీ మాస్టర్. సాధారణంగా జానీ మాస్టర్ కు ఎలాంటి పర్ఫామెన్స్ అంత ఈజీగా  నచ్చదు. అలాంటిది ఇక జానీ మాస్టర్ స్టేజి మీదికి వచ్చి ప్రశంసించడం తో ఆ కంటెస్టెంట్ ఆనందంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: