ఫుల్ స్పీడ్ మీద ఉన్న కిరణ్ అబ్బవరం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ స్పీడ్ మీద ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే,  ఈ హీరో రాజావారు రాణి వారు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు,  ఈ సినిమాతో  కిరణ్ అబ్బవరం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను  తెచ్చుకున్నాడు.  ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణమండపం'  సినిమాలో  నటించాడు,  ఈ సినిమా విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలగజేసింది, ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, టీజర్ కు,  ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి,  అలాగే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.  

ఇలా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు,  అందులో భాగంగా ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమాలో నటించాడు,  ఈ సినిమా మరికొ న్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం మరి కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు, వాటి లో  ఒక మూవీ కి తాజాగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'  అనే టైటిల్ ను ఖరారు చేశారు,  ఈ టైటిల్ తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.  కోడి రామకృష్ణ పెద్ద కూతురు దివ్య ఈ మూవీ ని నిర్మిస్తున్నారు,  కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టాకీ పార్టు ను పూర్తి చేసుకుంది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ కి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు, ఈ సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: