కచ్చా బాదం పాటపై.. అల్లు అర్జున్ కూతురు అర్హ స్టెప్పులు?

praveen
కచ్చా బాదం.. అక్కడ ఇక్కడ కాదు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఈ పాటకి కాలు కదుపుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను ఈ పాట తెగ షేక్ చేస్తోంది. ఈ పాట పాడింది భారీ రెమ్యునరేషన్ తీసుకునే గొప్ప సింగర్ కాదు కేవలం పల్లీలు అమ్ముకుంటూ సాదాసీదా జీవితం గడిపే ఒక సామాన్య వ్యక్తి. పాడింది ఎవరైతే మనకెందుకు మనకు నచ్చింది కదా అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు.. టాలెంట్ ఉండాలి కానీ ఎవరు పాడితే ఏంటి అని అనుకుంటున్నారు మరికొందరు. ఏదేమైనా ఇటీవలికాలంలో కచ్చా బాదం పాట తెగ వైరల్ గా మారిపోయింది.

 కాస్త సమయం దొరికిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఈ పాట పై స్టెప్పులు వేయడం అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు. ఇక ఈ పాట పై డాన్స్ చేయడం వల్ల కొంత మంది ఫేమస్ కూడా అవుతున్నారు కూడా . ఇప్పటికె ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ పాటపై డాన్స్ చేసి సోషల్ మీడియాలో వీడియోలో పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ పాట పై ముద్దు ముద్దు గా డాన్స్ చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియోని అల్లుఅర్జున్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. బన్నీ కూతురు ఎంతో ముద్దుగా చేసిన డాన్స్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పాలి.

 ఇంతకీ ఈ పాట ఎలా వచ్చిందంటే పశ్చిమబెంగాల్ కు చెందిన భువన్ అనే వ్యక్తి పల్లీలు అమ్ముకుంటూ ఉండే వాడు. అయితే అరుస్తూ పల్లీలు అమ్ముకోవడం  కంటే కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని భావించి ఇక ప్రత్యేకంగా ఒక లిరిక్స్ రాసుకుని పాటపాడుతూ పల్లిలు అమ్మడం మొదలు పెట్టాడు. ఆ తరువాత బిజినెస్ కూడా బాగా డెవలప్ అయింది. అతని చుట్టూ చేరి ఆ పాటను కావాలని మరి పాడించుకునే వారు జనాలు. ఈ క్రమంలోనే  ఒక వ్యక్తి అతను పాట పడుతున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక మొదట మోడల్ అంజలి ఆరోరా ఈ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు వేసి వీడియో చేసింది. దీంతో ఈ పాటకి ఒకసారి ఎత్తుక్రేజ్ పెరిగి పోవడంతో మిగతా సెలబ్రిటీలు కూడా దీనిపై రీల్స్ చేయడం మొదలుపెట్టారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: